NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీచర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

1 min read

ఎంఈవో లు ఫైజున్నిసా బేగం, మల్లికార్జున నాయక్..

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ ​నేడు  : నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో ఏపీ అకాడమిక్ ఇన్ స్ట్రక్టర్ల నియామకం కింద మూడు స్కూల్ అసిస్టెంట్ తాత్కాలిక ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయిందని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారులు ఫైజున్నిసా బేగం,మల్లికార్జున నాయక్ బుధవారం అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో కడుమూరు జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాలలో ఎస్ఏ ఉర్దూ సబ్జెక్టు-1,తలముడిపి జిల్లా పరిషత్-1 హిందీ, అలగనూరు జిల్లా పరిషత్ (హిందీ) పోస్టులు ఉన్నాయని తాత్కాలికంగా 5 నెలల పాటు (8.12.2025 నుండి 7.5.2026)వరకు వారు పనిచేస్తారు.ప్రతినెలా 12,500 రూ.ల వేతనం ప్రభుత్వం ఇస్తుందని బీఈడీ అర్హత తప్పనిసరిగా ఉండాలి.ఈనెల 5వ తేదీ చివరి రోజు మండలం మరియు గ్రామాలకు చెందిన వారే ఉండాలి.మిడుతూరు లో ఎంఆర్సి భవనం నిర్మాణంలో ఉన్నందున మిడుతూరు జిల్లా పరిషత్ పాఠశాల ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలన్నారు.6వ తేదీన జిల్లా కలెక్టర్ ఎంపిక చేస్తారనిఉద్యోగాలకు ఎంపిక అయిన వారు 8వ తేదీన జాయిన్ కావాల్సి ఉంటుందని ఎంఈఓ లు తెలిపారు.

About Author