విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యం
1 min read

ప్రతీ తరగతి గదికి వెళ్లి విద్యార్థినులతో మమేకమై వారి విద్యా ప్రగతిని తెలుసుకున్న జిల్లా కలెక్టర్
జిల్లా కలెక్టర్ కె.వెట్రీ సెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సమాజంలో విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రతీ తరగతి గదికి వెళ్లి విద్యార్థినులతో మమేకమై వారి విద్యా ప్రగతిని స్వయంగా పరిశీలించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల అభ్యాసన సామర్ధ్యాన్ని పరిశీలించి మరింత మెరుగైన బోధన చేయాలనీ ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ చిన్నతనం నుండి ఇష్టపడి విద్యను అభ్యసిస్తే ఉజ్వల భవిష్యత్తు మన సొంతం అవుతుందని, ప్రతీ విద్యార్థి ఇష్టంతో కస్టపడి చదివి కలలను సాకారం చేసుకుని ఉన్నతస్థానాలు పొందాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్య శాఖాధికారి వెంకటలక్ష్మమ్మ, నియోజకవర్గ ప్రత్యేక అధికారి, గృహ నిర్మాణ శాఖ పీడీ సత్యనారాయణ ఐసిడిఎస్ శారద, జిల్లా బాలల సంరక్షణాధికారి సూర్యచక్రవేణి, తహసీల్దార్ సుమతి, ఎంఈఓ ఏ .వి. ఎన్ .వి. ప్రసాద్, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్, సర్పంచ్ తోట ఏసమ్మ ప్రభృతులు పాల్గొన్నారు.

