దివ్యాంగులకు అల్పాహారం,ఆర్థిక సహాయం అందించిన బోద్దాని శ్రీనివాస్
1 min read

దివ్యాంగులకు కేక్ తినిపించిన కార్పొరేటర్ అఖిలప్రియ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: అన్నార్తులకు ఆపద్బాంధవుడు, అడిగిన వారికి లేదనకుండా కాదనకుండా సాయం చేసే మహోన్నత మనసున్న మహా మనిషి , తనకున్న దానిలో పదిమందికి పంచె సుగుణం గల వ్యక్తి ఆయనే ఎవరంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఇడా చైర్మన్ బొద్దా అని శ్రీనివాస్ అని 50 డివిజన్ ల లో ఎవరిని కదిపిన చెప్పే పేరు శ్రీనివాస్ పేరు, ఆయనే కాదు ఆయన కుటుంబ సభ్యులకు కూడా అదే బాటలో నడుస్తుంటారు. బొద్దాని గారాల పట్టి ప్రస్తుత కార్పొరేటర్ అఖిలప్రియ కూడా తండ్రి బాటలో నే ప్రయాణిస్తుంది. గత కోవిడ్ కాలంలో బొద్దాని తన శక్తికి మించి ప్రతి డివిజన్ లో ఇంటింటికి వెళ్లి స్వయంగా నిత్యవసర సరుకులు ఒకసారి కాదు. రెండుసార్లు కాదు అనేకసార్లు తన స్వహస్తాలతో అందించి అందరి మనసుల్లో కుటుంబాల్లో దేవుడిగా చెరగని ముద్ర వేసుకున్నారు అనటానికి అతిశయోక్తి కాదు. ప్రస్తుతం బొద్దాని శ్రీనివాస్ కూటమి ప్రభుత్వంలో తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నాడు ఆయన నివాసం వద్ద అనేకమంది దివ్యాంగులకు అల్పాహారం అందించి,ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆయన ఆయన కుటుంబ సభ్యులు, చేసే వ్యాపారం చల్లగా ఉండాలని ఆర్థికంగా మరింత ఉన్న స్థితికి ఎదగాలని, ఇంకా ఎంతోమంది పేదలకు నిరుపేదలకు కడుపు నింపి ఆర్థిక సహాయాన్ని అందించాలని ఆ భగవంతుడు చల్లగా చూడాలని చేతులెత్తి నమస్కరించారు. సందర్భంగా బొద్దాని మాట్లాడుతూ దివ్యాంగులు దైవ సమానులుగా నేనుభావిస్తున్నాను.రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా మన ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) దివ్యంగుల సంక్షేమానికి ఆర్థికంగా ఎదగటానికి అవసరమయ్యే ఇల్లు, పెన్షన్లు, ట్రై సైకిళ్లు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని. అదే విధంగా ఏలూరు శాసనసభ్యులు దివ్యాంగుల కు అన్ని వేళల ఏది కావాలన్నా నెరవేర్చడంలో ఆయన ముందుంటారని. అలాగే ఆయన బాటలో నేను కూడా నా వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని మీ సంక్షేమానికి నా సహకారం సహాయం ఉంటుందన్నారు. దివ్యాంగ విద్యావంతులు మన ఏలూరులో జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఉద్యోగ అవకాశం తో పాటు ఇంకా అనేక లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం బొద్దాని కుమార్తె, కార్పొరేటర్ అఖిల ప్రియ కేక్ కట్ చేసి విచ్చేసిన పలువురు దివ్యాంగులకు తినిపించి అందించారు.


