బడుగు,బలహీన వర్గాల కోసం డాక్టర్:బి.ఆర్ అంబేద్కర్ ఎనలేని కృషి చేశారు
1 min read

ఆయన ఆశయ సాధనలో మనమంతా పయనిద్దాం
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషి భావితరాలకు ఎంతో స్పూర్తిదాయకం అని దెందులూరు శాసన సభ్యులు చింతమనేని ప్రభాకర్ అన్నారు, ఆ మహనీయుడి స్పూర్తితో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అండగా నిలుస్తూ సుపరిపాలనే ధ్యేయంగా పాలన కొనసాగిస్తుందని, ఆయన ఆశయ సాధనలోనే మనమంతా పైనిద్దామని దెందులూరు ఎమ్మెల్యే అన్నారు.రాజ్యాంగ నిర్మాత డాక్టర్:బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని పెదవేగి మండలం దుగ్గిరాలలోని జోసఫ్ నగర్ లో శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల గ్రామ సర్పంచ్ గుంజా.క్రిస్తుమని మధుబాబు, సీనియర్ నాయకులు చింతమనేని సతీష్ , ఇప్పిలి వెంకటేశ్వరరావు (వైవిఆర్), దేవరపల్లి ఆదాం సహా పలువురు స్థానిక కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

