ఎంపీ కార్యాలయంలో డా:బి. ఆర్.అంబేద్కర్ 69వ వర్ధంతి
1 min read

నివాళులర్పించిన స్థానిక నేతలు, కార్యాలయ సిబ్బంది
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నివాళి అర్పించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దళితులు సహా దేశ ప్రజలు ఈరోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం వెనుక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి , ఆయన రాసిన పటిష్ట రాజ్యాంగమే కారణమని పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు,ఎంపీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

