NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాసపేట’లో వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

1 min read

ప్రజలకు ఉచితంగా మందుల పంపిణీ..

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని మాసపేట గ్రామంలో జరిగిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది.మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆల్కేమ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ వలీ టొబాకో ట్రేడర్స్ అధినేతలు అబ్దుల్ సలాం,వలి భాష ఆధ్వర్యంలో వైద్య శిబిరం జరిగింది.ఈ శిబిరాన్ని ఉదయం జడ్పిటీసీ సభ్యులు పర్వత యుగంధర్ రెడ్డి,వంగూరు జనార్దన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ శంషున్ భీ,కంపెనీ ఏరియా ఇన్చార్జి కే.అరుణ్ కుమార్, ప్రారంభించారు.కర్నూలు సన్ రైస్ హాస్పిటల్ డాక్టర్ స్ఫూర్తి రెడ్డి,జనరల్ ఫిజీషియన్ వెంకటేశ్వర్లు రోగులకు చికిత్సలు అందించారు. బీపీ,షుగర్,కంటి చికిత్స తదితర వాటి గురించి చికిత్స చేసి డాక్టర్లు మందులను ఉచితంగా పంపిణీ చేశారు. శిబిరానికి 155 మంది హాజరైనట్లు అబ్దుల్ సలాం, వలిబాష తెలిపారు.ఆరోగ్యం సమస్యలు వచ్చిన వెంటనే జాగ్రత్తలు తీసుకొని డాక్టర్లను సంప్రదించాలని డాక్టర్లు ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి,అన్వర్ భాష,వైసీపీ మండల కార్యదర్శి కలమందలపాడు మహెబూబ్ భాష,షఫీ,సిరాజ్ భాష మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

About Author