NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కడుమూరు విద్యార్థిని అభినందించిన డీఈవో

1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు  : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి పి జనార్దన్ రెడ్డి అభినందించారు.9 వ తరగతి చదువుకున్న పిఎస్ రుమానా(14) కౌశల్ జిల్లా స్థాయి పోస్టర్ ప్రెజెంటేషన్ విభాగంలో జిల్లా నుండి రాష్ట్రస్థాయికి ఎంపిక అయినట్లు అదేవిధంగా విద్యార్థికి నగదు మరియు మేమెంటో,సర్టిఫికెట్ ను డీఈవో అందజేసి నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర కిశోర్ బుధవారం తెలిపారు. పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మొఘల్ అమానుల్లా బేగ్, చాంద్ భాష,ఉమామహేశ్వరి, పాఠశాల కమిటీ సభ్యులు తదితరులు పాఠశాలలో విద్యార్థిని అభినందించారు.

About Author