ఆప్టా రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు గా నిడుబ్రోలు రమాదేవి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: మచిలీపట్నం యందు జరిగిన ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్టా రాష్ట్ర కార్యవర్గ సమావేశం యందు తీసుకొన్న తీర్మానం ప్రకారం ఆప్టా రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు గాబాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాం బోట్ల పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి నిడుబ్రోలు రమాదేవి ని నియమించడం జరిగింది.కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం పై పోరాటం ను తీవ్ర తరం చేయడానికి మరియు సి పి ఎస్ విధానం లో ఉన్న ఉపాధ్యాయులను ఏకం చేయుట కొరకు ఆప్టా సి పి ఎస్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గా వి రమణ,ఎస్ జి టి ,ఎం పి పి ఎస్, తంగుడుబిల్లి గ్రామం, నెల్లిమర్ల మండలం, విజయనగరం జిల్లా మరియు ఆప్టా సి పి ఎస్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎం మధుసూదన్ రెడ్డి, ఎస్ జి టి, ఎం పి పి ఎస్, చిల్లబండ గ్రామం, కోడుమూరు మండలం, కర్నూలు జిల్లా ని నియమించడం జరిగింది. వీరు ఈ రోజు నుండి రాష్ట్రం లో ఆయా విభాగాల్లో ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) తరపున తమ యొక్కవిభాగంలో అధికార ప్రతినిధులు గా తమ యొక్క బాధ్యతలు నిర్వహిస్తారు .


