ఘనంగా కట్టమంచి రామలింగారెడ్డి 145వ జయంతి వేడుకలు
1 min read

ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయం లో కార్యక్రమం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సి.ఆర్.రెడ్డి గా ప్రసిద్ధులు అయిన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి “145 వ” జయంతిని (ప్రతిభావంతుడైన సాహితీవేత్త ,విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు) వేడుకలను బుధవారం నిర్వహించినట్లు జిల్లా కేంద్ర గ్రంథాలయ ఉపగ్రంధ పాలకులు ఎ. నారాయణరావు తెలిపారు. ఈసందర్భంగా ఆయన కట్టమంచి రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కట్టమంచి రామలింగారెడ్డి చిత్తూరు జిల్లాలోజన్మించారని,ఆయన చదువులో ఎప్పుడు మొదటి క్లాసులో ఉత్తీర్ణత సాధించే వారనిఅలాగే ఆయన మంచి రచయిత తెలుగులో ముసలమ్మ మరణం అనే కావ్యాన్ని మరియు భారత అర్థశాస్త్రం, వేమన, కవిత్వ తత్వం, అనే రచనలు రచించారని అలాగే ఆంగ్లంలో కూడాఎన్నోరచనలు రచించారని వాటిలో the philosophy of history, drama in the East and West రాశారన్నారు. అలాగే శాసనసభ్యులుగా కూడా చేశారని, అలాగే ఆయన పేరు మీద ఏలూరు పట్టణంలో సర్ సి. ఆర్. రెడ్డి పాఠశాల, మరియు కళాశాల, విద్యాసంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది అని తెలుపుతూ అలాంటి మహోన్నతమైనవ్యక్తి ను స్మరించుకుంటూఆయన జయంతిని ఏలూరు జిల్లాకేంద్ర గ్రంథాలయంలో జరుపుకోవడంగొప్పఅదృష్టం గాభావించవచ్చుఅని తెలిపారు. ఈ కార్యక్రమంలోజిల్లాకేంద్ర గ్రంథాలయసిబ్బంది మరియు గ్రంథాలయపాఠకులు పాల్గొన్నారు.

