శరీర ఆరోగ్యం పై అందరూ దృష్టి పెట్టాలి..
1 min read
ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవాలి.
లీ హెల్త్ డొమైన్,లీ ఫార్మా అధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన.
ఎముకల పటిష్టతపై ప్రతి ఒక్కరు శ్రద్ద తీసుకోవాలి.
లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ళ లీలారాణి .
అక్కిరెడ్డిపాలెం,విశాఖపట్నం, న్యూస్ నేడు: మనిషి శరీరం నిత్యం ఆరోగ్యంగా,యవ్వనంగా,ఉత్సాహంగా ఉండే విధంగా చూసుకోవల్సిన బాధ్యత మన అందరిపై ఉందని,ఎవరికి వారు తమ శరీర ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని,మెరుగైన ఆహారం తీసుకోవాల్సిన బాధ్యతలు తీసుకోవాలని లీ ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ ఆళ్ళ లీలారాణి తెలిపారు.లీ హెల్త్ డొమైన్, లీ ఫార్మా లిమిటెడ్ సహకారంతో స్దానిక అక్కిరెడ్డిపాలెంలోని శ్రీ సాయి సార్వణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో ప్రధానంగా ఆంత్రోపోమెట్రిక్ కొలతలు, చేతి పట్టు బలం, శరీర కూర్పు, ఎముకల ఖనిజ సాంద్రత, డాక్టర్ కన్సల్టేషన్ మరియు పోషకాహార నిపుణుల కన్సల్టేషన్ వంటివి నిర్వహించారు. డాక్టర్లు మరియు పోషకాహార నిపుణులు వైద్య శిబిరానికి హాజరైన వారి రిపొర్టులను పరిశీలించారు. ఈ సందర్బంగా వైద్యలు మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకొవాలని,పోషకాహార మార్గదర్శకాలను అందించారు.అనంతరం ఈ కార్యక్రమంలో లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ళ లీలా రాణి మాట్లాడుతూ రోజువారి దిన చర్యలో మనిషి తన ఆరొగ్యంపై కనీస శ్రద్ద చూపడం లేదని,ఇటువంటి పరిస్ధితుల్లో అనారొగ్యాల బరిన పడుతున్నారాని అవేదన వ్యక్తం చేశారు.ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలనే సంకల్పంతో లీ హెల్త్ డొమైన్,లీ ఫార్మా లిమిటెడ్ మరియు స్ధానిక అధికారులు,ప్రజాప్రతినిధుల సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని,వీటి ద్యారా తల్లులకు,బిడ్డలకు ప్రోటిన్లతో కూడిన కిట్లు ,మందులు అందజేస్తున్నామని లీలారాణి వివరించారు.క్యాంప్ కోఆర్డినేటర్లు సరోజిని , జయలక్ష్మి , డాక్టర్ రాధిక కిరణ్ , పోషకాహార నిపుణురాలు మాధురి, జి.ఎన్.ఎం భాగ్యలత, లీ ఫార్మా బృందం, స్కూల్ ప్రిన్సిపాల్ చంద్రమౌళి , భార్గవి మరియు స్కూల్ టీచర్లు పాల్గొన్నారు.


