NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు పార్లమెంట్ అభివృద్ధి పైనే దృష్టి

1 min read

ఎంపీ పుట్టా మహేష్ కుమార్

ఏలూరు అభివృద్ధికి కేంద్రం సహకారం ఉంది

పెండింగ్ పనులన్నీ త్వరలోనే పూర్తి

‎ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు పార్లమెంటు పరిధిలో కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న పనుల సాధనకు, కొత్త అభివృద్ధి పనుల మంజూరుకు పార్లమెంటు శీతాకాల సమావేశాలను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చక్కగా ఉపయోగించుకుంటున్నారు. పార్లమెంట్ సమావేశాలలో పాల్గొంటూనే సమయం దొరికినప్పుడల్లా వివిధ శాఖల మంత్రులను కలుస్తూ  ఏలూరు పరిధిలోని పెండింగ్ పనులను, అర్జీలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గత పదిరోజులుగా ఢిల్లీలో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పాల్గొంటూ ఏలూరు పార్లమెంట్ కు సంబంధించిన వివిధ పెండింగ్ పనులను, కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన విషయాలను వివరించారు.కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి  ఏలూరు- జంగారెడ్డిగూడెం రోడ్డు జాతీయ రహదారిగా విస్తరించాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పినట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలియజేసారు. ఈ రహదారిపై ప్రధానమంత్రి కి కూడా లేఖ రాసినట్టు, త్వరలో ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని కలిసి  ఏలూరు- జంగారెడ్డిగూడెం రహదారిపై మాట్లాడానున్నట్లు ఎంపీ వెల్లడించారు. తాను ఢిల్లీలో ఉన్నప్పటికీ తన పార్లమెంటు పరిధిలోని ప్రజలు ఎవరైనా  ఏలూరులోని తన కార్యాలయ సిబ్బందిని కలిసి తమ సమస్యలను తెలియచేయవచ్చని ఎంపీ పేర్కొన్నారు. రాష్ట్రంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను, ప్రాజెక్టులను సాధించి ఏలూరు పార్లమెంటును అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ప్రజల మద్దతుతో ఏలూరు పార్లమెంటును నెంబర్ 1గా నిలపగలనన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

About Author