NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

” జిల్లా జడ్జి జిల్లా జైలు … మహిళా జైలు ఆకస్మిక తనిఖీ “

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: జిల్లా ప్రధాన న్యాయ మూర్తి / జిల్లా న్యాయ సేవాది కార సంస్థ అధ్యక్షులు జి. కబర్థి మరియు  బి. లీలా వెంకట శేషాద్రి , కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాది కార సంస్థ, కర్నూల్  గారు పురుషుల జిల్లా కారాగారము మరియు మహిళ కారాగారామును తనిఖీ చేయడం జరిగినది.  ఈ సందర్భంగా  జిల్లా జడ్జి  జైలు నందు ఏర్పాటు చేసిన      ప్రిజన్ లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్ మరియు  క్లినిక్ ను తనిఖీ చేసి “జైలు ఖైదీలకు ప్రిజన్ లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్ &క్లినిక్స్” గురించి వివరించారు. ఇందులో ఒక అడ్వకేట్, ఒక ప్యారా లీగల్ వాలంటీర్ ఉంటారని, వారు ఖైదీలకు న్యాయ సహాయాలు అందిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా జైలులో ఉన్న ఖైదీలు వారి కున్న హక్కుల ను తెలుసు కోవాలని తెలిపారు.ఖైధి లకు ఎవరికైనా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు.  70 ఏళ్ళు వయస్సు పై బడిన ఖైధిలకు, అనారోగ్యంతో బాధ పడే వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తా మని త్యరగా బెయిల్ మంజూరు అయ్యేలా కృషి చేస్తామని తెలిపారు.   ఖైధి లకు అందించే ఆహారాన్ని,రేషన్ ను వారి ఆరోగ్యం గురించి తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ఖైధి లను కోర్ట్ వాయిదా లకు కచ్చితంగా హాజరు చెయ్యాలని ఆదేశించారు.ఏవైనా సమస్యలుంటే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కర్నూలు వారిని సంప్రదించవచ్చును అన్నారు,  లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 పై ప్రచారం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జైలు అధికారులు, లీగల్ ఎయిడ్ న్యాయవాది శివరాం, ఖైదీలు పాల్గొన్నారు.

About Author