సమస్యలు పరిష్కరించడానికి మేమున్నాము..తాసిల్దార్ రమాదేవి
1 min read

మహానంది, న్యూస్ నేడు: ప్రజా వేదిక ద్వారా ప్రతి సోమవారం వచ్చే ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి మేమున్నామని మహానంది మండల తహసిల్దార్ రమాదేవి పేర్కొన్నారు. మహానంది తాసిల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా వేదికలో భాగంగా వచ్చే దరఖాస్తులను ప్రజల నుండి ముఖ్యంగా రెవెన్యూ విభాగంలోని భూ సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని తాహసిల్దార్ రమాదేవి తెలిపారు. మండల కేంద్రంలో కాకుండా జిల్లా కేంద్రానికి వ్యయ ప్రయాసలకు ఓర్చి తమ సమస్యల పరిష్కారం కొరకు ప్రజలు వెళ్తున్నారని అలా వెళ్లడంవల్ల సమయం వృధా అవ్వడంతో పాటు ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయని వీటన్నింటిని గమనించి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తు చేసుకుంటే త్వరగా సమస్యలు పరిష్కారం అవుతాయని, సమయం ఆదా అవుతుంది అని తహసిల్దార్ పేర్కొన్నారు. ఇక్కడ పరిష్కారం కానీ వాటికి సంబంధించి ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక సమర్పించి పరిష్కారం మార్గం సుగమం అయ్యేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనిని గమనించి ప్రజలు ముఖ్యంగా మండల తాహసిల్ కార్యాలయంలో సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారం జరిగే ప్రజా వేదికను ఉపయోగించుకోవాలని మహానంది మండల తహసిల్దార్ రమాదేవి మండల ప్రజలను కోరారు.


