NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంద్రకీలాద్రి కొండపైకి వెళ్లే భక్తులకు ఉచిత అన్న ప్రసాద వితరణ

1 min read

ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ దంపతులు

ప్రారంభించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు : ఆధ్యాత్మిక భావనతో చేసే సేవలే ప్రజల మన్ననలు పొందేందుకు మూలమని జెడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ ప్రసాద్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి  ప్రసాద్పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రి కొండకు కాలినడకన వెళ్ళే దీక్షాదారుల సౌకర్యార్థం ఏలూరు పోస్టర్‌ కాలనీ 7వ రోడ్డు ఎదురుగా మినీ బైపాస్‌ వద్ద జెడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఒక్కరోజు అల్పాహారం, అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని, ఉచిత వైద్య శిబిరాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వివిధ ప్రాంతాల నుండి కాలినడకన ఏలూరు మీదుగా విజయవాడ వెళ్తున్న భవానీలకు అల్పాహారాన్ని అందించారు. పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాజకీయాలతో పాటూ మండల దీక్షలు పూర్తిచేసుకున్న భక్తులకు సేవలందించేందుకు జెడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ ఆధ్వర్యంలో చేపట్టిన చర్యలు అత్యంత ప్రశంసనీయమని అభినందించారు. చైర్‌పర్సన్‌ పద్మశ్రీ మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని సేవాకార్యక్రమాలను నిర్వహించనున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, కార్పొరేటర్‌ కలవకొల్లు సాంబ, ఘంటా ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

About Author