NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్రిస్మస్ ప్రజ‌లంద‌రూ సంతోషంగా జ‌రుపుకోవాలి.. రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  క్రిస్మస్ పండుగ‌ను అంద‌రూ సంతోషంగా జ‌రుపుకోవాల‌ని రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని మౌర్య ఇన్‌లో క‌ర్నూలు న‌గ‌రంలోని పాస్టర్లతో మంత్రి టీజీ భ‌ర‌త్ క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ స‌ర్వీస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా పాస్టర్లను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పాస్టర్ల దీవెనలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పాస్టర్లకు ఎలాంటి అవ‌స‌ర‌మైనా తాను అండ‌గా ఉంటాన‌న్నారు. ఇత‌రుల‌కు సేవ చేస్తే మ‌న‌కెంతో మంచి జ‌రుగుతుంద‌ని అంద‌రూ గ్రహించాల‌న్నారు. త‌న తండ్రి టీజీ వెంక‌టేష్ నుండి త‌న‌కు సేవా గుణం వ‌చ్చింద‌న్నారు. తాము ఏనాడు మాటిచ్చి త‌ప్పలేద‌ని మంత్రి తెలిపారు. ఇక త‌మ కూట‌మి ప్రభుత్వం అన్ని కులాలు, మ‌తాల అభివృద్ధికి కృషి చేస్తుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author