NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉపాధి యావరేజ్ వేజ్ రేట్‌ను అధిగమించి జిల్లా ర్యాంకును మెరుగుపర్చాలి

1 min read

పెండింగ్‌లో ఉన్న మస్టర్స్‌ను తక్షణమే అప్డేట్ చేయాలి

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్ నేడు: ఉపాధి హామీ పథకంలోని యావరేజ్ వేజ్ రేటును అధిగమించి జిల్లాను మెరుగైన స్థానంలో నిలపాలని  జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఎపిడిలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఉపాధి హామీ పనుల పురోగతిపై ఎపిడిలు, ఎపిఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డ్వామా పీడీ సూర్యనారాయణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 17, 18 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నందున, ఉపాధి హామీ బడ్జెట్‌కు సంబంధించిన పనులను వేగవంతం చేసి జిల్లాను మెరుగైన ర్యాంకులో నిలపాలని ఎపీడీలను ఆదేశించారు. లేబర్ బడ్జెట్ అమలులో డోన్, ప్యాపిలి, ఔక్, చాగలమర్రి, బనగానపల్లె మండలాలు తక్కువ పురోగతి నమోదు చేశాయని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న మస్టర్స్‌ను వెంటనే అప్డేట్ చేసి సోమవారం నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. యావరేజ్ వేజ్ రేట్ విషయంలో కొత్తపల్లి, బండి ఆత్మకూరు, ఆళ్లగడ్డ మండలాలు నిరుత్సాహకర ఫలితాలు సాధించాయని, సంబంధిత ఎపిడిలు ప్రత్యేక శ్రద్ధతో లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని ఆదేశించారు.  అదేవిధంగా క్యాటిల్ షేడ్స్, సోక్ పిట్స్, కంపోస్ట్ పెట్టెలు వంటి పనుల్లో వంద శాతం లక్ష్యాలను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

About Author