NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జలదుర్గం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి

1 min read

– సిఐటియు -అవాజ్  రాస్తారోకో

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని పెద్ద గ్రామమైన జలదుర్గం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని సిఐటియు మండల కార్యదర్శి చిన్న రహీమాన్, నాయకులు నక్కి శ్రీకాంత్, అవాజ్ కమిటీ నాయకులు రసూల్,కాంగ్రెస్ నాయకులు నాగరాజు,చక్రాల కాజా డిమాండ్ చేశారు. సోమవారంజలదుర్గం బస్టాండ్ లో సిఐటియు , ఆవాజ్ కమిటి ఆధ్వర్యంలో   రాస్తారోకో కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమం సిఐటియు నాయకులు పద్మశాలి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్యాపిలి మండలం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అతిపెద్ద మండలం గా విస్తరించిందని ఈ మండలాలలోని ప్రజలు మండల కేంద్రానికి పోవాలంటే అనేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ప్రభుత్వ కార్యాలయాలు ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాలలో ఏ చిన్న పని పడిన అక్కడికి చేరుకోవాలంటే రైతాంగం ఇబ్బందులు వర్ణాతీతం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.  చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాలు అనంతపురం జిల్లాకు దగ్గరలో కూడా ఉన్నాయంటే ఇక్కడి ప్రజల ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని వారన్నారు.ఈ కారక్రమములో ఎంపిటిసి  జయరామయ్య,సిఐటియు నాయకులు గౌండా హుస్సేన్ ,వడ్డే శ్రీనివాసులు, గౌండా.మధు, కెవిపి ఎస్ నాయకులు శివ, ప్రతాప్ రాసిపోగుల, హుసేనాళం,నాగేశ్వరావు, తిరుపాలు,అవాజ్  కమిటి నాయకులు మాసూమ్, మహబూబ్ బాషా, ఖలీల్ రుసుం పీర్, ఇదురు, పామ్ బాషా,  హుస్సేన్ పీర్ , మహిళా నాయకులు రాసిపోగుల పుల్లమ్మ, రోజాబీ, హుస్సేన్బి నూర్జహాన్  తదితరులు పాల్గొన్నారు.

About Author