ఆర్టీసిలో ప్రవేశ పెట్టాలను కుంటున్న విధ్యుత్ బస్సులు ఆర్టీసి ద్వారా నిర్వహించాలి
1 min read

ఆర్టీసిలో ఉన్న 10 వేలు ఖాళీలను భర్తికీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయాలి.
విజయవాడ, న్యూస్ నేడు : స్త్రీశక్తి పధకాన్ని ఉద్యోగులంతా విజయవంతము చేయడానికి కృషి చేస్తుంటే… ఆర్టీసి అధికార్లు మాత్రం చిన్నచిన్న తప్పులకు కూడా సస్పెండ్లు,పనిష్ మెంట్లు ఇస్తున్న చర్యలు మానుకోవాలి.ప్రభుత్వంఅనుమతించిన ఆర్టీసి ఉద్యోల పదోన్నతలు అన్ని ఈనెలాఖరులోగా ఇవ్వాలి. ఏపి పిటిడి (ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ ఏపియస్ ఆర్టీసిలో డీజల్ ఖర్చులు తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రవేశ పెట్టాలను కుంటున్న విధ్యుత్ బస్సులను ఏపిపిటిడి ఎంప్లాయీస్ యూనియన్ (ఇ.యు) గా స్వాగతిస్తున్నామని అయితే ఈబస్సులు ప్రవేటు ఆపరేటర్ల ద్వారా కాకుండా ప్రభుత్వమే కొనుగోలుచేసి ఆర్టిసీ ద్వారా ఆర్టిసి సిబ్దందితోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని లేదంటే దశాభ్దాల చరిత్ర గలిగిన ఆర్టీసిని కేంధ్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేటు పరం చేసేందుకు తీసుకుంటున్న కుట్రలు గా ఉద్యోగులు భావించే ప్రమాదం ఉన్నందున విధ్యుత్ బస్సులు అన్ని ఆర్టీసి ద్వారా నిర్వహించాలని,అన్ని విద్యుత్ బస్సులే కాకుండా కొన్ని డీజల్ బస్సు కూడా కొనుగోలు చేయాలని ఏపిపిటిడి (ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు,రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.వి.నరసయ్య డిమాండ్ చేసారు .ఈసమావేశంలో పాల్గోన్న ఇ.యు రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.వి.నరసయ్య మాట్లాడుతూ ఆర్టీసి ఉద్యోగుల పదోన్నతలు దీపావళి కానుకగా ఇస్తున్ణామని ముఖ్యమంత్రిగారే ప్రకటిస్తూ జీఓ ఇచ్చినప్పటికీ సుమారు 7 వేలు మంది పైబడి పదోన్నతలకు అర్హులు ఉన్నా సరే ఇంకా వెయ్యిమంది కూడా పదోన్నతలు ఆదేశాలు రాకపోవడం చాలా బాదాకరమని ఈ పెండింగు పదోన్నతలు అన్ని ఈనెలాఖరులోగా ఇచ్చేలా చర్యలు తీసుకోవ్లని విజ్ఞప్తి చేసారు.ఈసమావేశంలో చేసిన తీర్మాణాల ప్రకారం ఎంప్లాయిస్ యూనియన్ 28 వ రాష్ట్రమహాసభలు 2026 మార్చి,ఏఫ్రిల్ నెలలో ఒంగోలులో నిర్వహించాలని,ఉద్యోగులు ఏదుర్కొంటున్న సమస్యలు,కొంతమంది అధికార్లుతీరు తధిర సమస్యలుపైన,ఏలూరు,రాజంపేట డీజల్ బంకులులలో ఆర్దిక లావాదేవిలపై బాద్యులపై చర్యలు తీసుకొని మిగిలినవారి వెంటనే న్యాయం చేయాలని,విలీనం తరువాత రిటైర్ అయిన ఉద్యోగులకు ఆర్టీసి ఆసుపత్రులలో మందులు ఇవ్వాలని,ధీర్గకాలికరోగులకు కూడా మందులు సప్లయి చేయాయని తధితర సమస్యలుపై సమావేశంలో చర్చకు వచ్చిన సుమారు 30 డిమాండ్లతో విసి & యం.డి రెండు మూడు రోజులలో లేఖ ఇచ్చి మేనేజ్ మెంటు స్పందనను బట్టి భవిష్యత్ కార్యచరకు వెళ్లాలని తిర్మాణించినట్లు ఇ.యు అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు తెలిపారు.ఈసమావేశంలో పాల్గోన్న ఇ.యు రాష్ట్ర వర్కింగు ప్రెసిడెంటు పి.సుభ్రమణ్యంరాజు,ఛీఫ్ వైస్ ప్రెసిడెంటు కె.నాగేశ్వరరావు,డిప్యూటీజెనరల్ సెక్రటరీలు జి.నారాయణరావు, యం.డి.ప్రసాధ్, పి. బానుమూర్తి,కోశాధికారి యం.డిఏ.సిద్దిక్ లతో పాటు ఇ.యు రాష్ట్రకమిటీ నాయకులు నాలుగు జోన్,26 జిల్లా,నాన్ ఆఫరేషన్ జిల్లాల అధ్యక్ష,కార్యదర్శులు తధితరులు పాల్గొన్నారు.


