NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అనుబంధం సర్టిఫికెట్లు మంజూరు చేయండి

1 min read

తహసిల్దార్ కార్యాలయంఎదుట సీపీఐ ధర్నా..

నందికొట్కూరు, న్యూస్​ నేడు: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరైన గృహాలకు పొజిషన్ (అనుబంధం)సర్టిఫికెట్లు మంజూరు చేయాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో గృహ నిర్మాణాల లబ్ధిదారులతో కలిసి ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పథకం కింద 2 లక్షల 50 వేల రూ.లు మంజూరు చేయడం జరిగిందని పట్టణంలో దాదాపు 400 మందికి గృహాలు మంజూరు అయ్యాయని అయితే లబ్ధిదారులకు రిజిస్టర్ కాగితాలు కానీ పట్టా కాగితం గాని ఉంటేనే బిల్లు పడే పరిస్థితి ఉందన్నారు. అనేకమంది ఉమ్మడి కుటుంబాల్లో ఉంటూ వారసత్వపు ఆస్తిని అగ్రిమెంట్ల ద్వారా అదేవిధంగా పట్టాలు లేని వాటికి అగ్రిమెంట్ల ద్వారా కొనుగోలు చేసి అనుభవం కింద ఉండి బేస్ మట్టం నిర్మించుకోవడం జరిగిందన్నారు.వీటిని కొలతలు తీసుకొని రెవెన్యూ అధికారులు పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయకపోతే బిల్లులో మంజూరు అయ్యే పరిస్థితి ఉండదన్నారు దీనివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు ఏమాత్రం సరిపోక దాదాపు మూడు లక్షల పైనే పెట్టుకునే పరిస్థితి ఉందన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2017-2018లో నందికొట్కూరు పట్టణంలో దాదాపు వేల గృహాలు మంజూరయ్యాయని తక్షణమే స్థానిక ఎమ్మెల్యే,ఎంపీ జోక్యం చేసుకొని అనుబంధ పత్రాలు మంజూరు చేసే విధంగా చూడాలన్నారు.లేకపోతే లబ్ధిదారులతో కలిసి తహ సిల్దార్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేపడతామని హెచ్చరించారు.తహసిల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కాటెపోగు సామన్న,నరసింహులు, చెరుకుచెర్ల గాబ్రియేల్,మహిళా సంఘం జిల్లా నాయకురాలు ముర్తు జాబి,మణికుమారి,రజియా పాల్గొన్నారు.

About Author