NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి, బంగారు భవిష్యత్తుకు దగ్గర కావాలి  

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:  యువత మత్తు పదార్థాలకు దూరమై బంగారు భవితకు దగ్గర కావాలని పత్తికొండ సిఐ జయన్న ఆకాంక్షించారు. బుధవారం అఖిల భారత యువజన సమైక్య ఏఐఎస్ఎఫ్  ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నియంత్రణ కోసం వాల్ పోస్టర్లను పత్తికొండ సిఐ ఏ జయన్న  చేతుల మీద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఐ జయన్న మాట్లాడుతూ, పత్తికొండ పట్టణంలో యువత డ్రగ్స్ నుండి దూరంగా ఉండాలని విద్య వైద్యం ఉద్యోగం వ్యాపారం వంటి విషయాలపై దృష్టి పెట్టి బంగారు భవిష్యత్తు వైపు నడవాలని సూచించారు. అఖిల భారత యువజన సమైక్య జిల్లా సమితి సభ్యులు పెద్దయ్య  మాట్లాడుతూ, యువత మంచి మార్గంలో నడవాలని, రాబోయే తరాలకు మార్గదర్శకం కావాలని, మారకద్రవ్యాలకు అలవాటు పడకూడదని మంచి చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు పొందాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు  అఖిల భారత యువజన సమైక్య మండల కార్యదర్శి అల్తా హుస్సేన్, సిపిఐ పందికోన శాఖ సెక్రెటరీ ఎన్ రవికుమార్, అఖిల భారత విద్యార్థి సమైక్య మండల కార్యదర్శి శివ, చిన్నముని కొత్తపల్లి హనుమన్న, హుస్సేన్, అఖిల భారతీయ యువజన సమైక్య పట్టణ కార్యదర్శి విజయ్, ఏ ఎస్ ఐ శివాజీ నాయక్, యువకులు తదితరులు పాల్గొన్నారు.

About Author