గ్రామాలను సంపూర్ణంగా అభివృద్ధి చేయడమే టిడిపి లక్ష్యం
1 min read

స్పష్టం చేసిన పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్
పత్తికొండ, న్యూస్ నేడు: గ్రామీణ ప్రాంతాల లో అభివృద్ధి పనులు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే కెఈ శ్యామ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం మండలం పరిధిలోని మారెళ్ళ౼ బొందిమడుగుల గ్రామాల మధ్యన నూతనంగా రూ 49.50 లక్షల తో నిర్మించిన బ్రిడ్జి ను, బొందిమడుగుల గ్రామంలో రూ 9.00 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఎం రమేష్, వడ్డే రంగస్వామి, మాబు,మోహన్, బైక్ ర్యాలీ తో భారీఎత్తున స్వాగతం పలికారు.సర్పంచ్ చౌడప్ప, సింగల్ విండో డైరెక్టర్ మోహన్, సర్పంచు సలహాదారుడు ప్రతాప్ యాదవ్, టిడిపి నాయకులు వెంకటరాముడు, జిన్నా మాబు, , స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ కు మేళతాళాలు, డ్రమ్స్ వాయిద్యాల మధ్య బాణా సంచులు కాల్చుతూ ఘన స్వాగతం పలికి, శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కెఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైసిపి పాలనలో గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదన్నారు. మారెళ్ళ ,బొందిమడుగుల గ్రామాల మధ్య ఉండే బ్రిడ్జి కూలిపోవడంతో ఈ గ్రామాల మధ్య ప్రజలు రాకపోకులకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు అన్నారు.5 సంవత్సరాలలో బ్రిడ్జి నిర్మాణ పనులు ను గత వైసిపి ప్రభుత్వం చేపట్టలేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టి ఈ ప్రాంత ప్రజలకు ఎంతో రవాణా సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి గ్రామం లో సిమెంట్ రోడ్లు వేయడం జరిగిందని తెలిపారు.


