ఏకీకృత కుటుంబ సర్వేతోనే సంక్షేమ పథకాలు
1 min read

చాగలమర్రి న్యూస్ నేడు : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏకీకృత కుటుంబ సర్వే చేపట్టిందని,రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏకీకృత కుటుంబ సర్వేతోనే సంక్షేమ పథకాలు అమలు అవుతాయని ఎంపీడీఓ తాహీర్హుసేన్ తెలియజేసారు. బుధవారం చాగలమర్రి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో ఈ సర్వే పై సచివాలయాల సిబ్బందికి ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూఈ సర్వేలో కుటుంబ ఆర్ధిక, సామాజిక, విద్యా, ఉద్యోగ సంబంధ సమాచారం సేకరించి యాప్ లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. సుమారు నెల పాటు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి ఆ ఇంట్లోని ప్రతి వ్యక్తి సమాచారాన్నీ సేకరించి ప్రతీ ఒక్కరి డేటా తీసుకుని ప్రతీ వ్యక్తితో ఈకేవైసీ చేయించాల్సి ఉంటుందన్నారు. అనంతరం శిక్షకులు వెల్పేర్ అసిస్టెంట్ ప్రసాద్,పంచాయతి కార్యదర్సి భరత్‌లు సచివాలయాల సిబ్బందికి యాప్లోనమోదు గురించి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జిఎస్డబ్ల్యూఎస్ డిప్యూటి ఎంపీడిఓ తారేకశ్వరి,పంచాయతీ కార్యదర్సులు,సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

