మంత్రాలయం దేవర లో సీతారామి రెడ్డి, తిక్కారెడ్డి
1 min read

మంత్రాలయం న్యూస్ నేడు : నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో దేవర ఉత్సవాల సందర్భంగా పలువురు నాయకులు అమ్మవార్ల ను దర్శించుకునేందుకు వేరు వేరు సమయాల్లో బుధవారం వచ్చారు. ముందు గా టిడిపి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, టిడిపి మండల కన్వీనర్ పన్నగ వెంకటేష్ స్వామి, మాధవరం అమర్నాథ్ రెడ్డి, చెన్న బసప్ప వచ్చారు. వీరికి వట్టేప్ప నర్సింహ, సుంకప్ప, వనికే నాగరాజు, గురురాజ, రఘు, ఏబు స్వాగతం పలికారు. వీరు మారికాంబ దేవి కి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు శాలువ కప్పి సన్మానించారు. అలాగే టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు, వైకాపా రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు వై. సీతారామిరెడ్డి తో పాటు వైకాపా మండల అధ్యక్షులు జి. భీమారెడ్డి, మండల ఇన్ చార్జ్ సి. వి. విశ్వనాథ్ రెడ్డి వచ్చారు. వీరికి సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య , వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర గారు, ఉప సర్పంచ్ హోటల్ పరమేష్ స్వామి గారు, ఎంపీటీసీ సభ్యులు వెంకటేష్ శెట్టి, మాజీ ఉప సర్పంచ్ గోరుకల్ కృష్ణ, మల్లికార్జున, జనార్దన్ రెడ్డి స్వాగతం పలికారు. వీరు మారికాంబ అమ్మవార్ల ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. వీరి కి ఆలయ అర్చకులు శాలువ కప్పి సన్మానించారు.

