NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ట్రంప్ సుంకాల నుండి ఆక్వారంగాన్ని కాపాడాలి

1 min read

చేపలు, రొయ్యల రైతులకు స్థిరమైన గిట్టుబాటు ధరలు కల్పించాలి

ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ బి.బలరాం డిమాండ్

ఆక్వారంగాన్ని వ్యవసాయ రంగంగా గుర్తించాలి.. ఆక్వా ప్రాంతంలో కాలువలు ఆధునికరించాలి

చేపల రైతులు సంఘం రాష్ట్ర అధ్యక్షులు నంబూరి వెంకటరామరాజు (తాడినాడ బాబు)

కొల్లేరు ఎకో సెన్సిటివ్ జోన్ ను రద్దు చేయాలి

కొల్లేరు కాంటూరును 5 నుండి 3కు కుదించాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతాంగాన్ని ఆదుకోవాలని, చేపలు రొయ్యల రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ బి. బలరాం, చేపల రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నంబూరి వెంకటరామరాజు (తాడినాడ బాబు) డిమాండ్ చేశారు. గురువారం కలిదిండిలోని కళ్యాణి ఫంక్షన్ హాలులో ట్రంప్ సుంకాలు – సంక్షోభంలో ఆక్వా రంగం – పరిష్కార మార్గాలు అనే అంశంపై ఆక్వా రైతుల జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎస్.మహంకాళి రావు అధ్యక్షత వహించారు. ఆక్వా రైతాంగ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన బి.బలరాం,తాడినాడ బాబు మాట్లాడుతూ ట్రంప్ సుంకాలు వలన ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.కాలువలు ఆధునికరించాలని కోరారు. పరిశుభ్రమైన నీరును అందించాలన్నారు. కొల్లేరు కాంటూరు కుదింపుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎకో సెన్సిటివ్ జోన్ రద్దు చేయాలన్నారు. ఆక్వా ప్రాంతంలో రోడ్లు వంటి మౌలిక సమస్యలు పరిష్కరించాలన్నారు. అందుకు తగిన నిధులు కేటాయించాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, ఆక్వా టెక్ పత్రిక ఎడిటర్ జోసెఫ్, ఆదర్శ చేపల రైతు కోకా శ్రీనివాసరావు, సుస్థిర వ్యవసాయ ప్రతినిధి షేక్ అలీ హుస్సేన్, ఆక్వా రైతులు ఘంటా సుబ్రమణ్యం, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు వీరవల్లి భాస్కరరావు, సిపిఎం నాయకులు చిన్నం మాధవ, పతివాడ కనకదుర్గ, జమ్ము దర్గ, చిన్నం శ్రీకాంత్, ఎస్ ఎన్ వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

About Author