NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాతృ మరణాలపై సమీక్ష సమావేశం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయము నందు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్.L. భాస్కర్ ఆద్వర్యం లో “మాతృ మరణాలపై సమీక్ష సమావేశం” (MDSR Sub Committee Meeting) నిర్వహించడమైనది. అనంతరం మాట్లాడుతూ బిడ్డకు జన్మనిస్తూ ఏ తల్లి చనిపోకూడదు,  ఏ శిశువు జన్మించే సమయంలో మృతి చెందకూడదాని తెలిపారు, ప్రతి గర్భిణీకి 12 వారాలలోపు అన్ని రకాల వైద్య పరీక్షలు,వైద్య సేవలు అందజేయాలనీ, హై రిస్క్ గర్భవతులను గుర్తించి వారికి ప్రత్యేక వైద్య సేవలు అందించాలని, గర్భవతులకు, బాలింతలకు పౌష్టికహారం గురించి అవగాహన కల్పించాలని తెలిపారు.     ఈ కార్యక్రమంలో మద్దికెర, పెద్ద హరివాణం, గోనెగండ్ల, గూడూరు, నందవరం,ప్రాథమిక   ఆరోగ్య కేంద్రలు మరియు , పట్టణ ఆరోగ్యకేంద్రం స్టాంటన్ పురం పరిధిలో  జూలై మరియు ఆగష్టు  నుండి నవంబర్ 2025 నెలలో సంభవించిన 6  ప్రసూతి మరణాల పై సమీక్ష నిర్వహించినారు. క్షేత్ర స్థాయిలోని సిబ్బంది ఆశా,ఆరోగ్య కార్యకర్త మరియు వైద్యాధికారులు గర్భవతులను వీలైనంత తొందరగా  గుర్తించి వారికి సరైన సమయంలో సమయానుసార వైద్య సేవలు అందించినట్లయితే తల్లుల మరణాల శాతం తగ్గించవచ్చని కమిటీ నిర్ధారించింది. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఉమా , , DPMO డాక్టర్. శైలేష్ కుమార్ ,ఆదోని డిప్యూటీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖధికారి డాక్టర్. సత్యవతి,గైనకాలజి విభాగం నుండి HOD డాక్టర్ సావిత్రి  ,అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్. వరలక్ష్మి, అనస్తీసియా విభాగం నుండి డాక్టర్ మురళి  ప్రభాకర్  , జనరల్ మెడిసిన్ విభాగం నుండి డాక్టర్ దివ్య, నెఫ్రాలాజిస్ట్ డాక్టర్ శ్రీధర్,బ్లడ్ బ్యాంకు నుండి డాక్టర్ రంగస్వామి,  సంబంధిత వైద్యాధికారులు, డి పి హెచ్ ఎన్ ఓ  అన్నపూర్ణ  ,పి హెచ్ ఎన్ మీనాక్షి,క్షేత్ర స్థాయి పర్యవేక్షకులు, ఆరోగ్యకార్యకర్తలు , ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

About Author