మినీ గోకులం ప్రారంభించిన ఎమ్మెల్యే..మాండ్ర
1 min read

5,76,688 రూ.ల సీఎంఆర్ఎఫ్ పంపిణీ
మిడుతూరు, (నందికొట్కూరు) న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చౌటుకూరు గ్రామంలో గురువారం ఉదయం మినీ గోకులం షెడ్డు ను నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రారంభించారు.గ్రామానికి చెందిన రైతు పశువుల షెడ్డు కోసం ప్రభుత్వ సహాయంతో నూతనంగా నిర్మించారు.ఆ తర్వాత 5,76,688 రూ.ల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన వడ్డే లేకేశ్వ రి-23,920,సుంకేసులకేడెపు మద్దిలేటి-52,768 రూ.ల చెక్కులను వారి ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు.నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామానికి చెందిన మావిళ్ళ నారాయణకు-2 లక్షలు,ఫైనాన్షియల్ అసెస్మెంట్ క్రింద బట్టు సుంకిరెడ్డికి(డెత్) 2 లక్షలు,దాసరి సంజ రాయుడు (డెత్)గారికి ఒక లక్ష రూ.ల చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్,మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి,వంగాల శివరామిరెడ్డి,ఎంపీడీవో దశరథ రామయ్య,తహసిల్దార్ శ్రీనివాసులు,గోవర్ధన్ రెడ్డి,నరసింహ గౌడ్,శబ్బు,రామ్ భూపాల్ రెడ్డి,వెంకటేశ్వర రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి,చాకర్ వలి,రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం,ఎస్ఐ ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు.

