NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎడ్యుకేషన్​ పై అవగాహన కల్పించిన ఆర్​యూ ఎన్​ఎస్​ఎస్​ వాలంటీర్స్​ యూనిట్​​

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జాతీయ సేవాపథకం స్ఫూర్తితో వాలంటీర్లు సమాజసేవలో భాగస్వాములు కావాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌ లర్ ఆచార్య వి. వెంకట బసవరావు పిలుపునిచ్చారు. యూనివర్సటీ ఇంజినీరింగ్ కాలేజీకి సంబంధించిన యూనిట్​ 4 ఆధ్వర్యంలో స్పెషల్ క్యాంపుల నేపథ్యంలో గురువారం పి. రుద్రవరం గ్రామంలో ఎన్​ఎస్ఎస్​​ వాలంటీర్లు విద్యార్థులను , బడి పిల్లలని వారి తల్లిదండ్రులను సమావేశపరిచి  వీరి ఆద్వర్యంలో ఎస్​ . రవి , ఎస్​ . నాగ చంద్రుడు ల సహాయంతో విమెన్​ చైల్డ్​ వైల్ఫేర్​ ఆక్టివిటీస్​ స్కిట్​ రూపంలో చేసి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ విధ్యార్థిని విద్యార్ధులకు గుడ్​ టచ్​, న్యూట్రిషన్​, అవేర్​నెస్​ ఆన్​ ఇంపార్టెన్స్​ ఆఫ్​ చైల్డ్​ ఎడ్యుకేషన్​ పై అవగాహన కల్పించారు. ఎస్​ఎస్​ఎస్​ స్పెషల్ క్యాంపులో మహిళలు పిల్లల సంక్షేమం కార్యక్రమాలు నిర్వహించారు.

About Author