పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి…
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్సులర్ ఆచార్య వి. వెంకట బసవరావు అభిప్రాయపడ్డారు. మూడవ శనివారం సందర్భంగా ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ ఆఫీసుతో పాటు, క్యాంపస్లోని బ్యాంకు పరిసరాల్లో నిర్వహించిన “స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర” కార్యక్రమంలో భాగంగా వర్సిటీ అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. “పర్యావరణ పరిరక్షణలో అవకాశాలు” అనే అంశంగురించి వర్సిటీ క్యాంపస్లో నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కమ్యూనికేషన్, స్వయంఉపాధి మొదలైన అంశాల్లో అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. దాంతోపాటు రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “స్వచ్ఛాంధ్ర మరియు ముస్తాబు” కార్యక్రమాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావలసిన అవసరముందన్నారు. అందులో భాగంగా పరిశుభ్రతను కాపాడటంలో ప్రతిఒక్కరూ తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. గత మూడురోజులుగా వర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగాలవారు పి. రుద్రవరం, నూతన పల్లె గ్రామాల్లో స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తూ గ్రామీణులను చైతన్యపరచడం సంతోషకరమని ఆచార్య బసవరావు హర్షం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కె. వెంకటరత్నం, డాక్టర్ బి. విజయుడుతోపాటు విద్యార్థినీ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, వివిధ విభాగాల అధ్యాపకులు, ఆచార్యులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

