NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పరిశోధనా దృక్పథాన్ని వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు

1 min read

తల్లిదండ్రులు పిల్లల  నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలి

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు, న్యూస్​ నేడు :  విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత, ఆలోచనా సామర్థ్యం, పరిశోధనా దృక్పథాన్ని వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు తోడ్పడతాయని  జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు.శనివారం ఉదయం స్థానిక ప్రభుత్వ టౌన్ మోడల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ను కలెక్టర్  ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు… అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రయోగాలు,  వినూత్న ఆవిష్కరణలను ఆసక్తిగా పరిశీలించి, వారి ప్రతిభను అభినందించారు.ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ సైన్స్ ఎగ్జిబిషన్‌ను మొత్తం ఏడు థీమ్స్‌తో నిర్వహించడం జరిగిందని తెలిపారు. పాఠశాల స్థాయి ప్రదర్శనలు డిసెంబర్ 16వ తేదీన, మండల స్థాయి ప్రదర్శనలు 17వ తేదీన, జిల్లాస్థాయి ప్రదర్శనలు 20వ తేదీన నిర్వహించామని కలెక్టర్ వివరించారు.పాఠశాలలో ఏర్పాటుచేసిన ముస్తాబు కార్నర్ పాయింట్ ను పరిశీలించిన కలెక్టర్.మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ముస్తాబు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని    కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి, ఎల్. సుధాకర్ జిల్లా సైన్స్ ఎగ్జిబిషన్ అధికారి రంగమ్మ, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ లోకరాజు, ప్రిన్సిపల్ ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author