NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పరిశుభ్రతను జీవితశైలిగా మార్చుకోవాలి

1 min read

కలెక్టరేట్‌లో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్

నంద్యాల, న్యూస్​ నేడు:  రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పరిశుభ్రతను జీవితశైలిగా మార్చుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ పేర్కొన్నారు.శనివారం నంద్యాల కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్రకార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్  మాట్లాడుతూ…ప్రతి నెల మూడవ శనివారం రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. పరిశుభ్రత అనేది ఒక్కరోజు లేదా ఒక్క నెలలో జరిగే కార్యక్రమం కాదని, అది ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా మారాలని తెలిపారు. మన రాష్ట్రాన్ని, జిల్లాను, మండలాన్ని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని  నిర్మించుకోగలమన్నారు. అనంతరం డిఆర్ఓ రాము నాయక్,  అధికారులు, సిబ్బందితో కలిసి స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు.

About Author