డ్రగ్స్’తో జీవితాలను నాశనం చేసుకోవద్దు
1 min read

డ్రగ్స్ వద్దని విద్యార్థులతో భారీ ర్యాలీ
ఎమ్మెల్యే జయసూర్య.. ఆత్మకూరు డీఎస్పీ
నందికొట్కూరు, న్యూస్ నేడు: డ్రగ్స్ మాదకద్రవ్యాలు వాడకం వల్ల జీవితాలను నాశనం చేసుకోవద్దని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మరియు ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజి నాయక్ అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి లీగల్ డ్రగ్స్ వద్దు.. మాదకద్రవ్యాలు వాడటం వల్ల కలిగే నష్టాల గురించి కళాశాల విద్యార్థులతో కలిసి పటేల్ సెంటర్ వరకు డీఎస్పీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మరియు ఆత్మకూరు డిఎస్పి,పట్టణ,రూరల్ సీఐలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, సుబ్రహ్మణ్యం మరియు ప్రొహిబిషన్ &ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.కేజీ రోడ్డ్ పటేల్ సెంటర్ లో అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలనిడ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మానవ హారంగా ఏర్పడి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. మాదకద్రవ్యాల నిరోధానికి ప్రజలు సహకరించాలన్నారు.కూటమి ప్రభుత్వం లీగల్ డ్రగ్స్ కు టీమ్ ను ఏర్పాటు చేసి డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం లేదా ఫిర్యాదులు ఉన్నట్లయితే వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి తెలుపవచ్చని అన్నారు.మాదక ద్రవ్యాల రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మాదక ద్రవ్యాల వినియోగం యావజ్జీవ కారాగార శిక్ష ఉంటుందని డిఎస్పి అన్నారు.నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ లా ఆఫ్ కింద కేసులు నమోదు అవుతాయని సీఐలు అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ బేబీ, ఎస్సైలు ఓబులేష్,మల్లికార్జున, మణికంఠ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.


