శ్రీశైలంలో… సాంస్కృతిక కార్యక్రమాలు
1 min read

శ్రీశైలం, న్యూస్ నేడు : దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈ రోజు (28.12.2025) శ్రీ సిద్దేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం, నెల్లూరు వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి.ఈ కార్యక్రమములో వినాయకస్తుతి, శివాష్టకం, శివపాదమంజీరనాదం, భో శంభో… శివశంభో, జతిస్వరం, నమశ్శివాయతే, శంభో శివశంభో తదితర గీతాలకు జ్యోత్స్న, దివ్యశ్రీ, చిన్మయి, శరణ్య, రమ్మ, వేదశ్రీ, లలిత తదితరులు నృత్యప్రదర్శన చేయనున్నారు.కాగా ఈ నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

