కర్నూలు సర్వజన వైద్యశాలలో పీడియాట్రిక్ సర్జరీ దినోత్సవం
1 min read

ప్రతి బిడ్డకు సురక్షితమైన శస్త్రచికిత్స పీడియాట్రిక్ సర్జరీ దినం
కర్నూలు, న్యూస్ నేడు: ఆసుపత్రి అడిషనల్ డి.ఎం.ఈ , సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ .కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఈరోజు పీడియాట్రిక్ సర్జరీ దినోత్సవం సందర్భంగా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మరియు పేషెంట్లు పాల్గొని చిన్నారులకు సురక్షితమైన, నాణ్యమైన శస్త్రచికిత్స సేవలను అందించడంలో పీడియాట్రిక్ సర్జన్ల కీలక పాత్రను గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు పిల్లలు పెద్దల కంటే పూర్తి భిన్నం వారి శరీర నిర్మాణం, వ్యాధులు, చికిత్స విధానాలు అన్నీ ప్రత్యేకమైనవి అందుకే పీడియాట్రిక్ సర్జన్లు చిన్నారుల కోసం ప్రత్యేక శిక్షణతో సిద్ధమై, ప్రతి బిడ్డకు సురక్షితమైన శస్త్రచికిత్స సేవలను అందిస్తున్నారు అని అన్నారు.కర్నూల్ వైద్య కళాశాల ప్రిన్సిపల్, డా.చిట్టి నరసమ్మ మాట్లాడుతూ:– పుట్టిన ప్రతి బిడ్డకు సురక్షితమైన శస్త్ర చికిత్స సదుపాయాలు పొందే హక్కు ఉందని, దానిని నెరవేర్చే బాధిత ప్రభుత్వానిది అని అందుకే ప్రభుత్వం చిన్న పిల్లల విషయంలో ఉత్తములైన ఆధునికమైన వైద్య సదుపాయాలు కల్పిస్తూ చిన్న పిల్లల చికిత్స నిపుణులను ప్రోత్సహిస్తుందని తెలిపారు.పిల్లలకు సమయానుకూలంగా చికిత్స అందించడానికి తల్లిదండ్రులు త్వరగా ఆసుపత్రిని సంప్రదించాలని ప్రతి బిడ్డ ఆరోగ్యం – మా ప్రథమ కర్తవ్యము అని అన్నారు.పీడియాట్రిక్ సర్జరీ హెచ్ ఓ డి డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ:-పీడియాట్రిక్ సర్జరీ విభాగంలో అత్యుత్తమ సదుపాయాలు, ఆధునిక పరికరాలు మరియు నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండటం ద్వారా రాష్ట్రంలోనే ప్రముఖ సేవలు అందిస్తున్నామని అలాగే, పుట్టిన కొద్ది రోజుల శిశువులకు అవసరమయ్యే అత్యవసర శస్త్రచికిత్సల నుండి చిన్నారుల్లో కనిపించే జన్యుపరమైన లోపాలు, అబ్డోమినల్ సర్జరీలు, ఛాతీ శస్త్రచికిత్సలు వంటి అనేక శస్త్రచికిత్సలను పీడియాట్రిక్ సర్జన్లు అత్యంత నైపుణ్యంతో నిర్వహిస్తున్నారని వివరించారు.ఈ కార్యక్రమంలో పీడియాట్రిక్ సర్జరీ విభాగాధిపతి, డా. శివకుమార్, పీడియాట్రిక్ హెచ్ ఓ డి డాక్టర్.శారద, అనస్థీషియా ప్రొఫెసర్, డా. రామ్ శివ నాయక్, పీడియాట్రిక్ అసిస్టెంట్లు మరియు పీజీలు తదితరులు పాల్గొన్నారు.

