NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సాయుధ దళాల ఫ్లాగ్ డే నిధికి మెప్మా మహిళా సంఘాల నుంచి రూ.2 లక్షల విరాళం

1 min read

దేశ రక్షణలో నిరంతరం  సేవలు అందిస్తున్న సైనిక కుటుంబాలకు అండగా నిలుద్దాం

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి

కర్నూలు, న్యూస్​ నేడు : దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన  సైనికులు, మాజీ సైనికుల  కుటుంబాలకు అండగా నిలవాలని  జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సూచించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో మెప్మా మహిళా సంఘాల నుంచి సాయుధ దళాల సంక్షేమ నిధికి సేకరించిన  రూ. 2 లక్షల చెక్కును మహిళా సంఘాల సభ్యులు కలెక్టర్‌కు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు మున్సి పాలిటీల్లో  మహిళా సంఘాల సభ్యులు తమ వంతు బాధ్యతగా రూ. 2 లక్షల చెక్కును అందజేశారని,  సైనిక కుటుంబాలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మహిళా సంఘాలు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యాన్ని బట్టి ఫ్లాగ్ డే నిధికి విరాళాలు అందించి దేశసేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. శ్రీనివాసులు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి రత్న రూత్, జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ టి. పద్మ, తదితరులు పాల్గొన్నారు.

About Author