స్మశాన వాటిక.. రహదారి మార్గానికి జనసేన నాయకులు స్వచ్ఛందంగా శ్రమదానం
1 min read

ప్రోక్లైన్ ఏర్పాటుచేసి స్మశాన వాటిక పరిసరాలన్నీ శుభ్రం చేయించిన నిల్లా సురేష్
కృతజ్ఞతలు తెలియజేసిన దేవాంగులు,గ్రామస్తులు
ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు,స్థానిక నాయకులు దృష్టి సారించి అభివృద్ధికి సహకరించాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక శనివారం పేట 25వ డివిజన్ లో ఆదివారం పలువురు జనసేన నాయకులు స్మశాన వాటిక కు దారి మార్గాన్ని స్వచ్ఛందంగా శ్రమదానం, ప్రోక్లైన్ సాయంతో రాష్ట్ర, జిల్లా నాయకులు దోనేపూడి లవరాజు, వాసా సాయి, మహేష్ చొరవతో గ్రామ అభివృద్ధికి అడుగులు వేశారు.ఎన్నో ఏళ్లగా ఈ రహదారి మరియు స్మశాన వాటిక లో పిచ్చి మొక్కలతో, పెద్ద పెద్ద చెట్లతో నిండి ఉండటంతో దేవాంగుల పార్థివదేహాలకు కర్మకాండలు జరిపించుకునేoదుకు ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యేవారు. స్మశాన వాటికలో మార్గం నడవలేని విధంగా ఏర్పడింది. స్థానికులకు ఎంతో ఇబ్బందులకు గురిచేస్తున్న. నాటి నుండి నేటి వరకు పట్టించుకునే నాధుడే కరువయ్యారు. స్థానికులు విషయాన్ని జనసేన రాష్ట్ర,జిల్లా నాయకులు. నిల్లా సురేష్ కు విషయాన్ని తెలియజేయడంతో వెంటనే స్పందించి సురేష్ జెసిభి ని ఏర్పాటు చేసి జనసేన నాయకుల సాయంతో శ్రేమదనానికి నడుం బిగించారు. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి సురేష్ సొంత ధన సాయంతో జెసిబి ఏర్పాటు చేసి స్మశాన వాకిట పరిసరాలన్నీ శుభ్రం చేయించడంతో శనివారపు పేట గ్రామ ప్రజలందరూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్నానాలకు నీటి వసతి, వర్షాకాలంలో వేచి ఉండుటకు షెడ్లు, పార్థివ దేహాలను తీసుకు వెళ్లేందుకు సీసీ రోడ్డు మార్గం, చుట్టూరా ప్రహరీ గోడ నిర్మాణం మరియు మరిన్ని వసతులకు గ్రామ ప్రజలందరూ పూనుకొవాలని, అలాగే ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, స్థానిక నాయకులు దృష్టి సారించి దేవాంగుల స్మశాన వాటిక అభివృద్ధికి సహకరించి తోడ్పల్సిందిగా మనవి చేశారు. ఈ కార్యాక్రమంలో డివిజన్ పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.

