డిసెంబర్ 30న ముక్కోటి ఏకాదశి ఉత్సవం
1 min read

శ్రీశైలం, న్యూస్ నేడు: డిసెంబరు 30న ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవం నిర్వహించబడుతుంది.ఈ ఉత్సవం సందర్భంగా ఆరోజు వేకువజామున శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉత్తరద్వార దర్శనం, రావణవాహనసేవ నిర్వహించబడుతాయి.ఈ ఉత్సవంలో భాగంగానే ఉత్సవమూర్తులను స్వామివారి ఆలయ ముఖమండప ఉత్తరద్వారం నుండి వెలుపలకు తోడ్కొనివచ్చి ఆలయ ఉత్తరభాగంలో రావణవాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు జరిపించబడతాయి.ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం గం.3.00లకు ఆలయద్వారాలను తెరచి మంగళ వాయిద్యాల అనంతరం గం.3.30ని!!లకు స్వామివారికి సుప్రభాతసేవ నిర్వహించబడుతుంది. తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రాత:కాలపూజలు జరిపించి గం.4.30 ని!!లకు స్వామివారికి, తరువాత అమ్మవారికి మహామంగళహారతులు జరిపించబడతాయి. అనంతరం ఉదయం 5. 30నిలకు రావణవాహనసేవ జరిపించబడుతుంది. ఆ తరువాత శ్రీస్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించబడుతుంది.శ్రీ స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం తదుపరి ఉదయం గం.6.00ల తరువాత దర్శనాలు, ఆర్జితసేవలు ప్రారంభమవుతాయి. ( కార్యనిర్వహణాధికారిఉత్తర్వుల మేరకు)శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ.

