రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రికి కానుకగా అందిస్తాం
1 min read

ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)
ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వైసిపి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తాం
జిల్లా అధ్యక్షుడు బడేటికీ వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో నూటికి నూరుశాతం విజయ ఢంకా మ్రొగించి రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కానుకగా అందిస్తామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి ప్రజల దృష్టిని మళ్ళించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న వైసిపి నేతల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని, ఇటువంటి చిల్లర చేష్టలతో వైసిపి ప్రజలకు మరింత దూరం అయ్యిందని చెప్పారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలను మసిబూసి మారేడుకాయ చేయాలనుకున్న అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టుగా సిట్ నివేదిక ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తనను రికార్డుస్థాయి మెజార్టీతో గెలిపించేందుకు సైనికుల్లా పనిచేసిన కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల వైసిపి నాయకులు, కార్యకర్తలు రఫా రఫా అంటూ ప్రజల్లో భయాందోళనలు రేకేత్తించేందుకు ప్రయత్నిస్తున్నారని అటువంటి వారి ఆటకట్టించేందుకు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇటువంటి ఉడత ఊపులకు తెలుగుదేశం పార్టీ నాయకులు గానీ, కార్యకర్తలుగానీ భయపడే ప్రశక్తే లేదని, సరైన సమయంలో సరైన బుద్ది చెప్పడం జరుగుతుందన్నారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజల ఛీత్కారాన్ని ఎదుర్కొన్నా వైసిపి నాయకులకు జ్ఞానోదయం కలగలేదని, భవిష్యత్తులో మరింత దారుణమైన ఫలితాలను చవిచూడాల్సిన పరిస్థితులు వైసిపికి ఎదురవుతాయని ఆయన స్పష్టం చేశారు.కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, కైకలూరు నియోజకవర్గ పార్టీ నాయకులు వీరమల్లు నరసింహారావు, కొడాలి వినోద్, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గూడవల్లి వాసు, జిల్లా అధికార ప్రతినిధి పూజారి నిరంజన్, జిల్లా పార్టీ మీడియా కో-ఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి ఉప్పాల జగదీష్ బాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు జంపా సూర్యనారాయణ, అహ్మద్ ఖాజాషేక్, కార్యదర్శి చింతాటి జ్యోతి, పార్టీ సీనియర్ నాయకులు బెల్లపుకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

