సాంప్రదాయ విలువిద్యలో సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు
1 min read

రాష్ట్రానికి ఏడు బంగారు,ఆరు సిల్వర్ పథకాలు
అభినందించిన రాష్ట్ర ప్రజలు
కర్నూలు, న్యూస్ నేడు: ట్రెడిషనల్ అర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ట్రెడిషనల్ అర్చరీ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 27,28,29వ తేదీల్లో హైదరాబాద్, ఖైరతాబాద్,ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో 5 వ జాతీయస్థాయి ట్రెడిషనల్ అర్చరీ పోటీలు నిర్వహించారు. పోటీలకు ట్రెడిషనల్ అర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ మదన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బం గా ఆయన మాట్లాడుతూ పోటీలలో ఐదు రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నట్లు చెప్పారు. కోచ్ ఎన్.వజ్రరాజు మాట్లాడుతూ ట్రెడిషనల్ అర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి 30మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. క్రీడాకారులకు కర్నూలు నగరంలోని ఆదర్శ విద్యామందిర్ హై స్కూల్ క్రీడా మైదానం నందు నందు శిక్షణ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్ క్రీడా కారులకు ఏడు బంగారు పథకాలు, ఆరు సిల్వర్ పథకాలు,10 కాంస్య పథకాలు సాధించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వ కారణం అని ఆయన కొనియాడారు. గెలుపు పొందిన క్రీడాకారులను తల్లి, తండ్రులు రాష్ట్ర ప్రజలు అభినందించారు.


