జనార్దన్ రెడ్డి ని పరామర్శించిన విష్ణువర్ధన్ రెడ్డి
1 min read

మిడుతూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు సల్కోటి గోవర్ధన్ రెడ్డి తండ్రి అయిన జనార్దన్ రెడ్డిని కోడుమూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డి విష్ణువర్ధన్ రెడ్డి సోమవారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.గత కొన్ని నెలల నుండి జనార్దన్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.విషయం తెలుసుకున్న విష్ణువర్ధన్ రెడ్డి ఆయనను పరామర్శించి కుమారుడు గోవర్ధన్ రెడ్డిని ఆరోగ్య స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి,జనార్దన్ రెడ్డి సమీప బంధువులు.

