NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలి

1 min read

పెరటి తోటల ఏర్పాటుకు చర్యలు

మండల వ్యవసాయ అధికారి షేక్షావలి..

నందికొట్కూరు , న్యూస్​ నేడు  : పెరటి తోటల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసే విధంగా రైతులు ముందుకు వెళ్లాలని మండల వ్యవసాయ అధికారి షేక్షావలి అన్నారు.నంద్యాల జిల్లానందికొట్కూరు పట్టణంలోమహిళా మండల సమాఖ్య కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ శాఖ,వ్యవసాయ అనుబంధ శాఖలు,రైతు సాధికార సంస్థ, సెర్ప్ -వెలుగు సంస్థల సమన్వయంతో మండల స్థాయి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో వెలుగు ప్రాజెక్టు ఏపిఎం శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి గ్రామ సంఘ సమావేశంలో ప్రకృతి వ్యవసాయ అంశాన్ని అజెండాగా తీసుకుని చర్చించాలని చిన్న రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేయడమే కాకుండా ప్రతి ఇంట్లో పెరటి తోటల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.ప్రకృతి వ్యవసాయాన్ని నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ జాతీయ స్థాయిలో అమలు చేయడం సంతోషకరమని, ప్రతి ఒక్కరు తప్పకుండా తమకు ఉన్న పొలంలో కనీసం ఒక 50 సెంట్లు ఐనా ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు.ప్రకృతి వ్యవసాయ విభాగం మండలంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు, కొత్తగా ఎంపికైన ఎన్ఎంఎన్ ఎఫ్ గ్రామాల్లో చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. అలాగే మండల సమాఖ్య స్థాయిలో ప్రకృతి వ్యవసాయ కమిటీగా ముగ్గురు సభ్యులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో మెలకువలు పాటించి అధిక దిగుబడులు సాధించి ప్రతి రైతుకు ప్రకృతి వ్యవసాయాన్ని పరిచయం చేయాలని ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని ఎంఏఓ షేక్షావలి అన్నారు.ఈ కార్యక్రమంలో సెర్ప్ సీసీలు  దాసు,రమణ,కృష్ణమూర్తి  మండల సమాఖ్య అధ్యక్షులు మరియు ఓబి మెంబర్స్ఆర్ఎస్ కె,ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.

About Author