డా.సుదారాణి సేవలు అభినందనీయం… ఇంచార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ సాయి సుధీర్
1 min read

కర్నూలు,న్యూస్ నేడు: కర్నూల్ మెడికల్ కాలేజీ యందు ఫిజియాలజీ విభాగాధిపతి డాక్టర్ సుధారాణి విబాగాధిపతి చక్కటి సేవలు అందించారని తన విభాగాన్ని సజావుగా గా ఎటువంటి ఇబ్బందులు రానివ్వకుండా తన పదవీకాలంలో చక్కగా నడిపించించారని ఆమె సేవలు గురించి కొనియాడారు. మంగళవారం నగరంలోని మెడికల్ కాలేజీ యందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఫిజియాలజీ విభాగ అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ సుధారాణి పదవీ విరమణ సందర్భంగా కాలేజి యందు ఘనంగా వీడ్కోలు సభ ఏర్పాటు చేసి వారిని సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ డా.సుదా రాణి సీనియర్ డాక్టర్ అని వారి కుటుంబంలో కూడా అత్యధిక మంది వైద్య విద్యలో రాణించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ హరి చరణ్, వివిధ విభాగాదిపతులు ప్రొఫెసర్ శ్రీరాములు, డా. రాజేష్, ప్రొఫెసర్ రాం శివనాయక్, డిప్యూటీ సూపరిండెంట్ డాక్టర్ లక్ష్మి, డాక్టర్. ఆదిమూలపు సతీష్, డాక్టర్ అరుణ డా.రేణుక, ఏపీ.జి.డి.ఏ నాయకులు డాక్టర్ దమాం శ్రీనివాసులు, అసోసియేట్ ప్రొఫెసర్ లు డాక్టర్. రాధిక, డా. ఎలిజబెత్ రాణి, డా. లక్ష్మి, డా. సోమశేఖర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లు డా. ఉమా మహేశ్వరి, డా. సురేష్, డా. తులసి, లెక్షరర్ సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

