ఏఐ ఆధారిత ఎంఆర్ఐ స్కాన్ ప్రారంభం
1 min read
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కిమ్స్ సవీర హాస్పిటల్ సేవలు
అనంతపురం, న్యూస్ నేడు : కిమ్స్ సవీర హాస్పిటల్ ఎప్పటికప్పుడు ఆధునిక వైద్య సేవలు అందించడంలో ముందుంటుందని జిల్లా వైద్యాధికారి డా. ఈ.బి. దేవి అన్నారు. బుధవారం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఏఐ పవర్డ్ ఎంఆర్ఐ స్కాన్‌ను ఆమె అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. ఈ.బి. దేవి మాట్లాడుతూ, వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడంలో ఈ ఏఐ ఎంఆర్ఐ స్కాన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ సిస్టమ్ ద్వారా మరింత స్పష్టమైన, అధిక క్లారిటీ కలిగిన ఇమేజెస్ లభిస్తాయని, దీంతో వ్యాధి నిర్ధారణ సులభతరం అవుతుందని వివరించారు. అనంతపురం–హిందుపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ టి.సి. వరుణ్ మాట్లాడుతూ, ఏఐ ఆధారిత ఆధునిక వైద్య సాంకేతికత అనంతపురం జిల్లాకు రావడం గర్వించదగిన విషయమని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కిమ్స్ సవీర హాస్పిటల్ ఎండీ ఎస్.వి. కిషోర్ రెడ్డి, సీఈఓ పి.ఎస్. ప్రసాద్, సీఓఓ సిద్ధారెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డా. అబిబ్ రాజాలు మాట్లాడుతూ ఏఐ ఆధారిత ఎంఆర్ఐ ద్వారా కార్డియాక్ ఎంఆర్ఐ, బ్రెస్ట్ ఎంఆర్ఐ వంటి అత్యాధునిక పరీక్షలు కేవలం కిమ్స్ సవీర హాస్పిటల్ లో మాత్రమే సాధ్యమని తెలిపారు.

