2025-26 నమోదు అయిన కేసులు వివరాలు..
1 min read

ప్రొహిబిషన్ &ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ పరిధిలో2025-26 సం.లో పట్టుబడిన కేసులో వివరాల గురించి నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సీఐ ఎస్ రామాంజనేయులు బుధవారం సాయంత్రం పాత్రికేయులకు వివరించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నాటు సారాయి కేసులు:7175 మంది అరెస్ట్,841 లీటర్ల నాటుసారా సీజ్, బెల్లము ఊట 17,860 లీటర్ల ధ్వంసం, 2.3 కేజీ ల నవాసగ్రం,3 వాహనాలు సీజ్ చేయడం జరిగింది.బెల్టుషాపులు కేసులు:39 మందిని అరెస్ట్ 83.44 లీటర్ల మద్యం సీజ్ చేయడం జరిగింది.అక్రమంగా కల్లు అమ్ముతున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి 70 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది.ఈ సంవత్సరంలో కల్లు దుకాణాల నుంచి 371 శాంపిళ్ళు సేకరించగావైన్ షాప్,బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి 41 శాంపిళ్ళు సేకరించడం జరిగిందన్నారు.చేసిన నేరాలు మరి చేయకుండా 116 మందిని బైండోవర్ చేయడం జరిగింది. బైండోవర్ ఉల్లంఘించిన 8 మందిని సంబంధిత తహసీల్దార్ ఎదుట హాజరు పరచి రూ.30 వేలు జరిమానను ప్రభుత్వ ఖజానాకు జమ చేయడం జరిగిందని ప్రొహిబిషన్ సీఐ రామాంజనేయులు తెలిపారు.

