జనవరి 3వ తేదీన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రాక
1 min read
ఉల్లి పంట నష్టపోయిన రైతులకు పరిహారం పంపిణీ
పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి.
జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి
కర్నూలు, న్యూస్ నేడు : ఉల్లి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జనవరి 3వ తేదీన కోడుమూరు మండల కేంద్రానికి విచ్చేస్తున్నారని, ఈ సందర్భంగా రైతులతో సమా, సభ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం కోడుమూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యుల పర్యటన సందర్భంగా సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ ఏర్పాట్లను క పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జనవరి 3వ తేదీన కోడుమూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న సభలో పాల్గొననున్నారని, సమావేశపు వేదిక ఏర్పాటు, స్టాల్స్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మైదానంలో పిచ్చి మొక్కలు తొలగించాలని, లెవెలింగ్ చేయించాలని, తాగునీటి సదుపాయాలు, భోజన సదుపాయాలు, సౌండ్ సిస్టం ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ వంటి ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం అందరినీ ఆహ్వానించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.. సభకు హాజరయ్యే రైతులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రైతులకు అందించనున్న ఉల్లి పంట నష్ట పరిహారం పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలన్నారు. సభ నిర్వహణలో వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలని కలెక్టర్ తెలిపారు.కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి వరలక్ష్మి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రాజా కృష్ణా రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్.ఈ మహేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

