గోషామహల్ ఎమ్మెల్యే రాజకీయ పార్టీల పై సంచలన కామెంట్స్
1 min read

మహానంది, న్యూస్ నేడు: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లోని గోషామహల్ కు చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ వివిధ రాజకీయ పార్టీలపై మహానంది కి దైవ దర్శనార్థమై వచ్చిన ఆయన దర్శనం అనంతరం బుధవారం సంచలన కామెంట్స్ చేశారు. మహానంది దేవస్థానం అభివృద్ధికి ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి 250 నుండి 300 కోట్ల రూపాయల నిధులు సేకరించి అభివృద్ధి చేయలేకపోతుందని, డబుల్ ఇంజన్ సర్కార్ నందు ఉన్నటువంటి ఏపీ సీఎం మరియు డిప్యూటీ సీఎం ప్రధానమంత్రి తో ఉన్న సత్సంబంధాల కారణంగా నిధుల సేకరణలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని అర్థం కావడం లేదన్నారు. తాను చిన్న వయసులో మహానంది క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు తెలిపారు. అప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా కొద్ది అభివృద్ధిలో ఉందన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హత్యలు అరాచకాలపై దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు స్పందించడం లేదన్నారు. కేవలం ఒకటి రెండు పార్టీలు మాత్రమే బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హత్యలు హత్యాచారాలపై స్పందిస్తున్నాయని మిగతా పార్టీలు మౌనం వహించడంలో అర్థం ఏమిటి ప్రశ్నించారు. కేవలం కొన్ని వర్గాల ఓట్లతోనే వివిధ రాష్ట్రాల్లో కొన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయా అన్నారు. 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోవడానికి భారత్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని ఎంతోమంది భారత సైనికుల ప్రాణ త్యాగం వల్లనే బంగ్లాదేశ్ ఏర్పడింది అని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా రాష్ట్రాలు దేశ అభివృద్ధికి పాటుపడాలని రాజకీయ పార్టీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మహానంది దేవస్థానం ఏఈఓ మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

