పర్యావరణ పరిరక్షణ పై అవగాహన సదస్సు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి జి. కబర్థి సూచనల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, కార్యదర్శి, బి.లీలా వెంకట శేషాద్రి శుక్ర వారం 02-01-2026న కర్నూలు, న్యాయ సేవా సదన్ నందు పొల్యూషన్ అధికారులతో మరియు ఎన్జీవోలతో పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకుపోయే చర్యలపై సమీక్ష నిర్వహించారు. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లోని దుర్భర వర్గాలలో పర్యావరణ చట్టపరమైన అక్షరాస్యతను పెంపొందించడానికి కృషి చేయాలని అలాగే ముఖ్యంగా పిల్లలు, వృద్దులు మరియు కార్మికులకు స్వచ్ఛంద సమాజ అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజలకు నీటి కాలుష్యం మరియు శబ్ద కాలుష్యం, నేల కాలుష్యం మరియు ఫ్యాక్టరీలో వ్యర్థాల దుర్వినియోగం పై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు మరియు ఎన్జీవోస్ అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం కోర్టు ఆవరణలో జడ్జిగారు మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యావరణ ఇంజనీర్ మొక్కలు నాటారు. ఈ సమావేశంలో పర్యావరణ ఇంజనీర్ పివి కిషోర్ రెడ్డి, అసిస్టెంట్ పర్యావరణ ఇంజనీర్ వెంకట సాయి కిషోర్, అనలిస్ట్ ఇమ్రాన్, రామకృష్ణ, పవన్, ఎన్జీవో డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శివరాం, న్యాయ వాది బాలాజి తదితరులు పాల్గొన్నారు.

