సమస్యలను పరిష్కరించాలని నిలదీసిన ఎంపీటీసీలు
1 min read

కో ఆప్షన్ నెంబర్ తండ్రీ కొడుకు లు మృతి చెందినట్లు జాబు కార్డు తొలిగింపు
పొదుపు లక్ష్మి బుక్కీపర్లు లోన్ చేస్తే అదనంగా వసూలు చేస్తున్న వైనం
మెనీ గోకులం షెడ్డు లో 97 వేల 150 రూపాయలు గోల్మాల్
ఆర్ఎంబి ,ఆర్టిసి, శిరి కల్చర్ శాఖ వారు గైర్హాజరు
ప్యాపిలి న్యూస్ నేడు: సాధారణ సర్వసభ సమావేశంలో పట్టణ,గ్రామాలలోని సమస్యలను పరిష్కరించుకుందామని మండల ప్రెసిడెంట్ గోకుల్ లక్ష్మి , ఎంపీడీవో ఏ. శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రతి మూడు నెలల జరిగే సర్వభ సభ సమావేశం ఎంపీపీ గోకుల లక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో మొదటగా విద్య, వైద్యం, హౌసింగ్, పిఆర్ ఏఈ, హార్టికల్చర్, వ్యవసాయం, పశుసం శాఖ, శిశు సంక్షేమ శాఖ వారు తమ పథకాల గురించి వారు చేసిన అభివృద్ధి గురించి సభాముఖంగా తెలియజేశారు. అనంతరం ఐకెపి నుంచి సిసి మాట్లాడగా బోయిన్ చెర్వుపల్లి చెందిన ఎంపీటీసీ ఏ .శేఖర్ పొదుపు లక్ష్మి బుక్కీపర్లు లోను చేస్తే ప్రతి సభ్యురాలితో 200 నుంచి 300 వరకు వసూలు చేస్తున్నారని వాటిని వెంటనే విరమించుకొని మహిళలకు సేవలు అందించాలని ఆయన కోరారు. అనంతరం మెనీ గోకులం షెడ్డు కోసం బోయిన్ చెర్వుపల్లి కు చెందిన బి. రామచంద్రుడు రైతు మినీ గోకులం షెడ్డు నిర్మించుకోగా 97 వేల 150 రూపాయలు మంజూరు కాక అడిగిన అధికారులను ఎరు పట్టించుకోక గోల్మాల్ అయ్యాయని సభలో తెలిపారు. అనంతరం జలదుర్గం కోఆప్సీ నెంబర్ రసూల్ తన కుమారుడు ఫీల్డ్ అసిస్టెంట్ మృతి చెందారని జాబు కార్డును తొలగించారని ఆయన ఎంపీపీకి మొరపెట్టుకున్నారు. ఏపీవో రవి సభలో అతనికి అప్పాజీ చెప్పి మీకు జరిగినట్టు వాటికి న్యాయం చేస్తామని వారు తెలిపారు. మా జాబు కార్డు మాకు ఆన్లైన్లో చేసి మాకు ఉపాధి పనులు కల్పించాలని కో ఆప్షన్ నెంబర్ రసూల్ తెలిపారు. అన్ని శాఖల వారు హాజరు కాక ఆర్ ఎం బి, ఆర్ టి, సిరి కల్చర్ శాఖలవారు సర్వసభ సమావేశానికి హాజరు కాలేదు వాటిపై ఎంపీడీవో ఏ చర్యలు తీసుకుంటారో తెలియదు, అలాగే ఈ సమస్యలన్నీ ఎంపీటీసీలు నిర్భయంగా తెలిపి సభ నుండి ఎంపీటీసీలు బాయికాట్ అయ్యారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి సభాపుముఖంగా ఈ సమస్యలన్నీటిని మళ్లీ మూడు మాసాలలో జరిగే సర్వసభ సమావేశానికి సమస్యలన్నీ పరిష్కరించి, పట్టణ గ్రామాలను అభివృద్ధిపరిచే విధంగా చూస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నాగార్జున, డిప్యూటీ తాసిల్దార్, పి ఆర్ ఏ ఈ ప్రభాకర్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర నాయక్, హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్లు, ఏవో శివకుమార్ గౌడ్, వ్యవసాయ అధికారి రాజేష్, ఏపీవోలు శ్రీవిద్య ,రవి, వైద్యాధికారి రాహుల్, ఆర్డబ్ల్యూఎస్ మధుసూదన్, హార్టికల్చర్ అధికారి కళ్యాణి, అంగనవాడి సూపర్వైజర్స్ దేవకృపమ్మ, పంచాయతీ సెక్రెటరీ ముంతాజ్ బేగం, సుబ్బమ్మ, ఎంపీటీసీలు, సర్పంచులు మరియు అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.


