సమాచార హక్కు చట్టం పై ఏలూరు డివిజన్ అధికారులు అవగాహన సదస్సు
1 min read
సమాచార హక్కు చట్టం పై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలి
పీ.వి. సందీప్ రెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సమాచార హక్కు చట్టము అమలులోకి వచ్చి 20 సంవత్సరములు పూర్తి అయిన సందర్భముగా ఈ చట్టం పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సమాచారహక్కు చట్టము అప్పీలేట్ అధారిటి మరియు జిల్లా అటవీ శాఖాధికారి, ఏలూరు జిల్లా, ఏలూరు పి.వి. సందీప్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ సందర్బంగా వారి కార్యాలయ పరిధిలో ఉన్న పౌర సమాచార అధికారులతో, సిబ్బందితో సమావేశమై సమాచార హక్కుచట్టం గురించి వివరించి పలు సూచనలు చేశారు. సమాచార హక్కుచట్టం వార్షికోత్సవములో భాగంగా ప్రజలకు మరియు సిబ్బందికి అవగాహన కార్యక్రమము సమాచారహక్కు చట్టం అనంతరం అవగాహన ర్యాలి అమీనాపేట, ఏలూరు పరిధిలో నిర్వహించినారు. ఈ కార్యక్రమమునకు ప్రజలు మరియు సిబ్బంది పౌరసమాచార అధికారులు, సిబ్బంది పాల్గోని విజయవంతము చేశారు.

