NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంఘసంస్కర్త,రచయిత్రి సావిత్రి భాయ్ పూలే 195వ జయంతి వేడుకలు

1 min read

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి.

ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యు ఏలూరు నగర అధ్యక్షురాలు కొండేటి బేబీ

సహాయ కార్యదర్శి కొల్లూరు సుధారాణి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యు) ఏలూరు నగర సమితి ఆధ్వర్యంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని సంఘసంస్కర్త రచయిత్రి సావిత్రిబాయి పూలే 195వ జయంతి కార్యక్రమం ఆర్.ఆర్.పేట, స్ఫూర్తి భవన్ నందు జరిగినది.జోహార్ సావిత్రిబాయి పూలే, సాధిస్తాం సాధిస్తాం సావిత్రిబాయి పూలే ఆశయాలను, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అంటూ నినాదాలు చేశారు. ఏలూరు నగర అధ్యక్షురాలు కొండేటి బేబీ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు అనంతరం మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా అనేక ఇబ్బందులను ఎదుర్కొని సావిత్రిబాయి పూలే చదువుకున్నారని ఆమె చూపించిన పోరాట స్ఫూర్తి తెగువ నేడు మహిళా లోకానికి నిరంతర ఆదర్శప్రాయమని ఆమె చూపిన మార్గంలో పయనిస్తూ సావిత్రిబాయి పూలే ఆశయాలను సాధించడమే ఆమెకు ఇచ్చే ఘనమైన నివాళి అని తెలిపారు. నేడు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పైన మహిళలపై జరుగుతున్న దాడులు హత్యలు, హత్యాచారాలకు వ్యతిరేకంగా సావిత్రిబాయి పూలే చూపించిన మార్గంలో పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య సభ్యులు ఉప్పులూరి లక్ష్మి భవాని జ్యోతి మేరీ జ్యోతి మావూరి విజయ, రాజమణి తదితరులు పాల్గొన్నారు.

About Author