NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అధిక సంఖ్యలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు

1 min read

వివిధ సేవల రూపేణ రు:1,38,532/-లు ఆదాయం సమకూరినది

నిత్య అన్నదాన సత్రం నందు సుమారు1234 మంది భక్తులు ప్రసాద వితరణ

భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు పర్యవేక్షణ

అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వాహణాధికారిణి ఆర్. వి.చందన

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: శనివారం సందర్భముగా ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దేవస్థానము నందు ఉదయం గం.08.00ల నుండి ఆలయ ముఖ మండపం నందు పంచామృతఅభిషేకం ఆలయ అర్చకులు,వేద పండితులు, ఆద్వర్యములో జరుపబడినది. ఈ కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనినారు. ఈ రోజు మద్యాహ్నం గం.03.30 లవరకు శ్రీ స్వామి వారి ఆలయమునకు వివిధ సేవల రూపేణా రూ1,38,532/-లు సమకూరినది. శ్రీ స్వామి వారికి స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 1233 మంది భక్తులకు అన్నదానము జరుపబడినది. శ్రీ స్వామి వారి దర్శనమునకు విచ్చేసిన ఎటువంటి ఇబ్బంది కలగకుండా  తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ అసిస్టెంట్ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెల్పినారు.

About Author